
గ్రామ సభలో విభజనపై చర్చ
గంజివారిపల్లి గ్రామసభలో పంచాయతీ విభజనపై మాట్లాడుతున్న గ్రామస్తులు
తలుపుల డిసెంబర్16 అనంత జనశక్తి న్యూస్
మండలం పరిధిలోని గంజి వారి పల్లి గ్రామంలో వేపమాని పేట గ్రామపంచాయతీ విభజన కు మంగళవారం గ్రామసభకు పలువురు గ్రామస్తులు హాజరై తమ ఆమోదాన్ని తెలిపారు. గ్రామ సభకు గ్రామ వార్డు సభ్యులు సంజీవ్, నాగలక్ష్మి సభా అధ్యక్షతన వహించగా ఎంపీడీవో నసీమ, గ్రామపంచాయతీ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభలో గంజివారిపల్లి, గంజివారిపల్లి ఎస్సీ కాలనీ, బోయపల్లి, గుర్రం గుండ్లపల్లి, కొత్తపూల వాండ్లపల్లి, కొత్తపూల వాండ్లపల్లి ఎస్సీ కాలనీ గ్రామస్తులు హాజరై గ్రామ విభజనకు తమ ఆమోదాన్ని తెలిపారు. ఎంపీడీవో నసీమా గ్రామసభ ప్రక్రియను వివరించారు. గ్రామ పంచాయతీ విభజన ఏ గ్రామస్తులయితే కోరుకుంటారో గ్రామసభ నిర్వహిస్తున్నామని గ్రామ సభలో ప్రజలు తమ అభిప్రాయాలు స్వచ్ఛందంగా అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తెలియ చెప్పవచ్చని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వేపమనిపేట పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు బస్సులు సమయానికి ఉండవని ప్రతి చిన్న విషయానికి సచివాలయానికి వెళ్లాలంటే తమ గ్రామాల నుంచి సచివాలయానికి వెళ్లాలంటే సుమారు 20, 25 కిలోమీటర్లు దూరం ఉంటుందని తమ గ్రామ పంచాయతీని విభజించి గంజివారిపల్లి ని నూతనముగా గ్రామపంచాయతీ ఏర్పాటు చేయలన్నారు. ప్రజల అభిప్రాయాలను గ్రామసభ తీర్మానం జిల్లా ఉన్నతాధికారులకు పంపుతామని ఎంపీడీవో నసీమ పేర్కొన్నారు. తలుపుల ఎస్సై నరసింహుడు తన సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.








