పైప్ లీకేజీ సమస్యపై ప్రజలు ఆందోళన వద్దు…

పైప్ లీకేజీ సమస్యపై ప్రజలు ఆందోళన వద్దు…

 

-ధర్మవరం పట్టణంలో పైప్‌లైన్ లీకేజీ – మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి రాగానే వెంటనే స్పందన.

-ప్రజల భద్రత కోసం హుటాహుటిన చర్యలు.

-గంటల వ్యవధిలో పైప్ లీకేజీ పరిష్కారం: మంత్రి ఆదేశాలతో చర్యలు వేగం.

-వెంటనే స్పందించిన హరీష్యుడు.

శ్రీ సత్య సాయి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3, అనంత జనశక్తి న్యూస్:

ధర్మవరం పట్టణంలో తుంపర్తి కాలనీ నీట్ పాయింట్ (పిటి–1615) వద్ద ఏర్పడిన తీవ్ర గుంత, పైప్ లీకేజీ సమస్యపై ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి వచ్చిన వెంటనే, మంత్రి అత్యంత ప్రాధాన్యతతో స్పందించారు.మంత్రి సంబంధిత మున్సిపల్, పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు, ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు తక్షణమే సంఘటన స్థలానికి వెళ్లి పర్యవేక్షణ చేపట్టారు.అక్కడే మున్సిపల్ అధికారులు, టెక్నికల్ సిబ్బందితో కలిసి పైప్ లీకేజీని సరి చేయించి, గుంతను పూడ్చేందుకు తక్షణ చర్యలు ప్రారంభించారు. రహదారి పక్కన నివసిస్తున్న కుటుంబాలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టడం వంటి పనులను వెంటనే ప్రారంభించారు. ప్రజలకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు.