
రంపచోడవరం ఏజెన్సీలో ఎదురుకాల్పులు
విజయవాడ నవంబర్ 19,అనంత జనశక్తి న్యూస్
రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భద్రతా దళాలు–మావోయిస్టుల మధ్య జరిగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.ఎన్కౌంటర్ ఘటనను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు.ఇవాళ్టి ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత అధికారిక నివేదిక విడుదల కానుంది.








