
మావోయిస్టుల అరెస్టులపై పోలీసుల వివరణ
విజయవాడలో ఇంటెలిజెన్స్ ఏడీజీ మీడియా సమావేశం
విజయవాడ నవంబర్ 19 అనంత జనశక్తి న్యూస్
రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలను అణచివేసేందుకు పోలీసు విభాగం చేపట్టిన చర్యలను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా వివరిస్తూ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.ఛత్తీస్‌గఢ్, తెలంగాణల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పటిష్ట నిఘా ఏర్పాటుచేసి ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆయన వెల్లడించారు.ఇటీవలి దాడుల్లో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలువురు మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, ప్లాటూన్ సభ్యులు 23 మంది సహా మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విస్తారమైన సామగ్రి స్వాధీనం చేసినట్లు తెలిపారు. నిన్న నిర్వహించిన తనిఖీల్లో కూడా భారీగా అతిభారీ ఆయుధ సామగ్రి ఉన్నట్టు చెప్పారు.అలాగే అల్లూరి జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందినది అని పేర్కొన్నారు. నిన్న మారేడుమిల్లి వద్ద జరిగిన ఎదురుకాల్పుల తర్వాత కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారని, వారిని పట్టుకునేందుకు బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు ప్రారంభించాయని తెలిపారు.








