
క్రోసూరు మండలంలో 17 నుండి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే.
శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే తెలపండి – వైద్యాధికారి మహమ్మద్ షాద్, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్.
క్రోసూరు,నవంబర్15. అనంత జనశక్తి న్యూస్.
క్రోసూరు మండలంలో ఈనెల 17 నుండి 30వ తేదీ వరకు కుష్టి వ్యాధిని గుర్తించే కార్యక్రమం ఎల్ సి డి సి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ ను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు వైద్య అధికారి మహమ్మద్ షాద్ అన్నారు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన కుష్టు వ్యాధి గుర్తించే కార్యక్రమం అమలుకు సంబంధించిన బ్యానర్ ను, కరపత్రములను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ షాద్ మాట్లాడుతూ ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలు, అపోహలు గురించి మారుమూల గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని, కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించటానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఇందులో భాగంగా మండలంలో ఈనెల 17వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు లెప్రసీ కేసుల డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్.సి.డి.సి) ద్వారా 14 రోజులు పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షించి సర్వేలో కుష్టి వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి తక్షణమే సత్వర చికిత్స అందిస్తారని తెలిపారు అలాగే కుష్టి వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత ఇవ్వడం ద్వారా వ్యాధిని అరికట్టి అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అని అన్నారు.

ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ చర్మంపై స్పర్శ లేని మచ్చలు, నొప్పి లేని బొడిపెలు, కనుబొమ్మలు మరియు కనురెప్పలు వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడకపోవడం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఉండటం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం మొదలైనవి కుష్టు వ్యాధి లక్షణాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శివుడు స్టాఫ్ నర్స్ అంజమ్మ, ఫార్మసిస్ట్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు








