త్వరలో బీసీలకు ఆదరణ – 3 పథకం

త్వరలో బీసీలకు ఆదరణ – 3 పథకం

కురుబల విజ్ఞాపనలకు సీఎం ఆమోదం

భక్త కనకదాస జయంతి సభలో మంత్రి సవిత

కళ్యాణదుర్గం నవంబర్ 08, అనంత జనశక్తి న్యూస్

వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చిరు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి సభలో మంత్రి సవిత మాట్లాడుతూ…. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో బీసీల పక్షపాతిగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ కు అభినందనలు. కురుబ కులం నీతి, నిజాయతీకి మారుపేరు. లోకేష్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. రాయలసీమలో అధికంగా ఉన్న కురుబ కులస్తులను గుర్తించి కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించడం, విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉంది. బీసీలు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ వంటి వారు. గుడికట్ల పూజారులకు గౌరవవేతనం ఇవ్వడం హర్షణీయం. గొర్రెల ఇన్సూరెన్స్ పై చంద్రబాబు, లోకేష్ చర్చిస్తున్నారు. త్వరలో ఇన్సూరెన్స్ ప్రకటించబోతున్నారు. ఆదరణ-1, ఆదరణ-2 తెచ్చింది చంద్రబాబు గారు, ఆదరణ – 3 తెచ్చేది కూడా చంద్రబాబు గారే. ఇటీవల కార్పోరేషన్ల బాధ్యులతో చర్చించాం. ఫెన్సింగ్, ఎల్ ఈడీ లైట్లు, గొర్రెల ఉన్ని కటింగ్ మిషన్లు అడిగితే ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆమోదించారు. చంద్రబాబు కురుబలకు పెద్దపీట వేశారు. నాకు బీసీ వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారని అన్నారు.

భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తిచేయండి

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ… కురుబల మనసు పాలలాంటి స్వచ్చమైనది. మేము పిలిచిన వెంటనే కనకదాసు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు లోకేష్ గారు విచ్చేయడం ఆనందంగా ఉంది. కురుబలకు న్యాయం చేసేందుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే, పట్టుదల ఉన్న నాయకుడు లోకేష్. మా ప్రాంతం పూర్తిగా కరువు ప్రాంతం, అభివృద్ధి చేయడం మీతోనే సాధ్యం. 2019-24 వరకు వైసీపీ మా ప్రాంతాన్ని విస్మరించింది. భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది మా కోరిక. నూటికి 95శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందిగా సురేంద్రబాబు విజ్ఞప్తిచేశారు.

బిసి భవనాలను నిర్మించాలి: పార్థసారథి

హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ… ఈ రోజు భక్త కనకదాసు 538వ జయంతిని యువనేత లోకేష్ నేతృత్వంలో రాష్ట్రపండుగగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. 2024లో రెండు లోక్ సభ, ఒక శాసనసభ ఇచ్చారు. భవిష్యత్తులో మరింతమందికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలి. ఎన్టీఆర్ హయాం నుంచి కురుబలను ఆదుకున్న పార్టీ టీడీపీ. కుప్పంలో రూ.5 కోట్లతో కళ్యాణమండపం నిర్మించారు. గుడికట్ల పూజారులకు 5వేలు గౌరవ వేతనం జివో ఇవ్వడం హర్షణీయం. గొర్రెలు, గొర్రెల కాపరులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 కళ్యాణ మండపాలు నిర్మించుకున్నాం. వడ్డెర, యాదవ, మైనారిటీ కళ్యాణ మండపాలకు కూడా సహకారం అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో బీసీ భవన్ లు మంజూరు చేయాల్సిందిగా ఎంపీ పార్థసారథి కోరారు.