
లక్ష దీపోత్సవ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
కార్తీక మాస వైభవం – ఉప్పొంగిన భక్తిభావం
మూడో రోజు కార్తీక మాస లక్ష దీపోత్సవానికి తరలివచ్చిన భక్తులు
దివ్యమైన దీపాల వెలుగుల్లో మెరిసిన మైదానం
మంత్రి నారాయణతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఇంటూరి, కాకర్ల తదితరులు
నెల్లూరు నవంబర్ 08, అనంత జనశక్తి న్యూస్
నెల్లూరు నగరంలోని విఆర్‌సీ మైదానం భక్తి భావంతో అశేష భక్తజనం సమూహంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ప్రాంగణంలో మంత్రి నారాయణ భక్తి భావంతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడవ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహించగా విపిఆర్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ నృత్యాలతో సభా ప్రాంగణంలో ఆధ్యాత్మికతను పెంపొందించారు. ముందుగా వి.ఆర్. సి మైదానానికి చేరుకున్న శ్రీ సౌభాగ్య భువనేశ్వరీ పీఠం పీఠాధిపతులు రామానంద భారతీ స్వామివారు వారికి.. పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కి, వేమిరెడ్డి కోటారెడ్డి కి కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం పలికారు. కార్తీక మాస లక్ష దీపోత్సవానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ , కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభంపాటి విజయరామిరెడ్డి తదితరులు పాల్గొని ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు.నాగేశ్వరస్వామికి, పండరీనాధ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.








