ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం- పచ్చని పుట్టపర్తిని నిర్మిద్దాం.జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం- పచ్చని పుట్టపర్తిని నిర్మిద్దాం.జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద

పుట్టపర్తి -అక్టోబర్,2, అనంత జనశక్తి న్యూస్

వనం మనం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం- పచ్చని పుట్టపర్తిని నిర్మిద్దాం మని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అన్నారు.గురువారం సోషల్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద వనం మనం కార్యక్రమంలో భాగంగా సహస్ర మొక్కల పంపిణీ/ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లా లో వనం మనం కార్యక్రమం చేపడుతున్నామని, జిల్లా అధికారులు మరియు ప్రభుత్వ సంస్థలు, ప్రజలు వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిందిగా తెలిపారు. తద్వారా జిల్లాలోని గ్రీన్ కవర్ను ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% మాత్రమే కాకుండా జిల్లాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు 50 శాతం గ్రీన్ కవర్ను సాధించే దిశలో ఉండాలన్నారు. ఇందులో భాగంగా జిల్లా సామాజిక వనవిభాగం వారి సిబ్బందితో ప్రజలకి అవగాహన కల్పిస్తూ వారి వద్ద ఉన్న 15 లక్షల మొక్కలలో ఉన్న నీడ నిచ్చే మొక్కలు, పండ్లను ఇచ్చే మొక్కలు, ఔషధ మొక్కలు, దేవత వృక్షాలను కావలసిన చెట్లను సంబంధిత అధికారుల ద్వారా గాని, మీరు నేరుగా అయినా గాని, మీ యొక్క ఆధార్ కార్డులను అడ్రస్సు మరియు వివరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీ ఎందు ఇచ్చి మొక్కలను పొందవచ్చునని అన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సోషల్ ఫారెస్ట్ డి ఎఫ్ ఓ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ లు కూడా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో సోషల్ ఫారెస్ట్ డి ఎఫ్ ఓ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్, టిడిపి నేత ఆదినారాయణ, అటవీ శాఖ, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.