
ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన…
-అలరించిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్యం…
-గురువు బాబు బాలాజీ
ధర్మవరం నవంబర్ 23, అనంత జనశక్తి న్యూస్:
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలితా నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ , రామ లాలిత్య, శిష్య బృందం 20 మంది పాల్గొని చేసిన నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురువు బాబు బాలాజీ మాట్లాడుతూ….. సాయిబాబా మీద ప్రత్యేకంగా రూపొందించిన సాయి చరితం, పుట్టపర్తి మహత్యం, మొదలైన పాటలకు, భరత నాట్యం ,కూచిపూడి సాంప్రదాయంలో నాట్యములను చేసి అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. అనంతరం శిల్పారామం ఏవో ఖాదర్ బాషా నాట్యం చేసిన చిన్నారులకు, ప్రశంసా పత్రాలతో పాటు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గురువులు బాబు బాలాజీ రామ లాలిత్యను ఘనంగా సత్కరించారు.








