ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలి

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ప్రతి గ్రామంలో పచ్చదనం

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్

ధర్మవరం, సెప్టెంబరు,20:అనంత జనశక్తి న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి వార్డులో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు.శనివారం ధర్మవరం మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీ ప్రతి వార్డు నందు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా ఈ మా ఈ మాసం థీమ్ లో గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ అని అన్నారు. జిల్లాను గ్రీన్ సత్యసాయి జిల్లాగా తీర్చిదిద్దాలని సంకల్పం చేసుకుంటున్నామని అన్నారు. రాబోవు ఏడాదిలోగా కోటి మొక్కలు నాటేందుకు మనందరం కలిసి కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు పక్కన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ప్రతి వ్యక్తి కూడా పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయని, ఆనందంగా కూడా ఉంటామని అన్నారు.విద్యార్థులు తమ ఇంటి పరిసరాలలో పాఠశాల పరిసరాలలో అనువైన ప్రదేశాలలో మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. అలాగే ప్రోత్సహించాలని చెప్పారు.సోషల్ ఫారెస్ట్ నర్సరీ ఆధ్వర్యంలో 15 లక్షల మొక్కలు ఉన్నాయని, ఫుడ్ బేరింగ్ వద్ద నాలుగు లక్షల మొక్కలు ఉన్నాయని, సదరు మొక్కలు పాఠశాలలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, ఖాళీ స్థలాలలో మొక్కలు పంపిణీ చేసి నటించడం జరుగుతుందని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా తప్పకుండా బాధ్యతగా సంరక్షించాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని నరకకుండా కాపాడాలని అన్నారు.అనంతరం స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మహేష్, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.