హరీష్ రావు చేతుల్లోకి బీజేపీ రిమోట్? 

హరీష్ రావు చేతుల్లోకి బీజేపీ రిమోట్?

సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, డిసెంబర్ 2 — అనంత జనశక్తి న్యూస్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే వ్యాఖ్యలు వెలువడ్డాయి. టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ వైఖరిని కదిలిస్తున్నాయి.సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ రిమోట్ కంట్రోల్ పూర్తిగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు చేతుల్లోకి వెళ్లిపోయిందని సంచలన ప్రకటన చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హరీష్ రావు కీలు బొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.ఇకపై హరీష్ రావు నిర్వహించే కార్యక్రమాలను కేటీఆర్ కంటే కూడా ఎక్కువగా ప్రొమోట్ చేసే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోందని సామ ఆరోపించారు.అలాగే హరీష్ రావు – ఈటల రాజేందర్ వ్యూహాల్లో బీజేపీ చిక్కుకుపోయిందని, ఈ ఇద్దరి ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిందని అన్నారు.సామ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి.ఇప్పటికే కొంతకాలంగా వినిపిస్తున్న “హరీష్ రావు బీజేపీలో చేరతారా?” అన్న ప్రచారానికి మరోసారి ఊపు వచ్చినట్టైంది.పార్టీలు ఎలా స్పందిస్తాయో రాజకీయ వర్గాలు సూసుతోన్నాయి.