రాజకీయాల్లో స్పేస్‌ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కవిత

రాజకీయాల్లో స్పేస్‌ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కవిత

కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని కవిత అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. సీఎం ఎందుకలా అంటున్నారో తెలియదు.. భయపడుతున్నారేమో? కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్‌రావుపై నాకు వేరే కోపం లేదు. ఇరిగేషన్‌పై 2016లోనే కేటీఆర్‌కు సూచించాను. కిందిస్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయని చెప్పా. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్‌ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే’’ అని తెలిపారు.