టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్‌..

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్‌..

“అనంతజనశక్తి న్యూస్”

న్యూజిలాండ్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా  టీం పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు.లక్ష్య ఛేదనలో కివీస్ ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా చేధించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. విజయం‌తో న్యూజిలాండ్ జట్టు మరోసారి ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. ఫైనల్‌లో ఎవరి తో తలపడనుందో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.