
ఈనెల జూన్ 28వ తేదీన “పల్స్ పోలియో” కార్యక్రమం
జాతీయ ఇమ్యూనిజేషన్ పల్స్ పోలియో బూత్ యాక్టివిటీ వాక్సినేషన్ కార్యక్రమం అధికారులు సమన్వయంతో విజయవంతం చేయండి
0 -5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి..
జిల్లాలో 2,83,430 మంది చిన్నారులు.. 82 యూనిట్లు.. 1,623 పోలింగ్ బూత్ లలో పల్స్ పోలియో కార్యక్రమం..
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం, జూన్ 22 :అనంత జనశక్తి న్యూస్
ఈనెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన నిర్వహించే జాతీయ ఇమ్యూనిజేషన్ కార్యక్రమంలో భాగంగా పల్స్ పోలియో వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు పల్స్ పోలియో- 2026పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.ఈబి.దేవితో కలిసి నిర్వహించి జిల్లా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యూనిజేషన్ కార్యక్రమాన్ని ఈనెల జూన్ 28వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 2,83,430 మంది చిన్నారులు (0-5 సంవత్సరాల మధ్య) ఉన్నారని, జిల్లాలోని 31 మండలాల పరిధిలో 51 పిహెచ్సిలు, 25 యూపీహెచ్సీలు, 6 పిపియూనిట్లు కలుపుకుని మొత్తం 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,289, అర్బన్ ప్రాంతాల్లో 334 కలుపుకొని మొత్తం 1,623 పోలింగ్ బూత్ లలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,25,136, పట్టణ ప్రాంతాల్లో 2,17,04 గృహాలు కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బూత్ యాక్టివిటీని ఈ నెల 28వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ఆరోజు మిగిలి పోయిన వారికి ఇంటింటి గృహ సందర్శన యాక్టివిటీని 29వ తేదీ మరియు 30వ తేదీన నిర్వహించడం జరుగుతుందన్నారు. ట్రాన్సిట్ ప్రాంతాలు, బస్ స్టేషన్ల, రైల్వే స్టేషన్ల నందు 58 బృందాలు, మొబైల్ టీంలు 68 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలలోనూ ఐఇసి కార్యక్రమాలను నిర్వహించాలని, చిన్నారులు ఎవరు కూడా మిగిలిపోకుండా, అందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు తల్లులకు, స్థానిక కుటుంబాలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అలాగే జిల్లా విద్యా శాఖ అధికారి అన్ని పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించాలని, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ నందు అవగాహన కల్పించాలని సూచించారు. మెప్మా, డిఆర్డిఎ పథక సంచాలకులు వారి పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు మండల, గ్రామ, జిల్లా సమాఖ్య సమావేశాలలో పూర్తి స్థాయి అవగాహన కల్పించి ప్రతి ఒక్క 0-5 సం.ల పిల్లలు అందరూ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు సమన్వయం మరియు పర్యవేక్షణ చేయాలని సూచించారు. మున్సిపల్, సీఈఓ జిల్లా పరిషత్ వారి పరిధిలోని పాఠశాలలోని టార్గెట్ గ్రూప్ పిల్లలను అందరిని కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ఫిలాంత్రపిస్ట్ లను కమ్యూనిటీ భాగస్వామ్యం చేసి ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని, ర్యాలీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏపీఎస్పీడీసిఎల్ వారు వ్యాక్సిన్ కోల్డ్ చైన్ స్టోరేజ్ నకు శుక్రవారం నుండి ఆదివారం వరకు నిరంతరాయ పవర్ సప్లై ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు రోటరీ క్లబ్ తదితర సంస్థలు పల్స్ పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆశా కార్యకర్తలు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, వ్యాక్సిన్ సమగ్రంగా వారి పరిధిలోని పోలింగ్ బూత్ ల మ్యాపింగ్ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.ప్రసన్న భారతి, జిల్లా పరిషత్ సీఈఓ జయలక్ష్మి, ఆర్ఎంఓ హేమలత, మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ రావు, డిటిసి వీర్రాజు, డీపీఓ నాగరాజు నాయుడు, పిడి మెప్మా విశ్వజ్యోతి, డిఎండబ్ల్యుఓ రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.








