తమిళనాడులో రైతులకు ఊరట..!

తమిళనాడులో రైతులకు ఊరట..!

రుణమాఫీపై విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

రూ.75 వేల వరకు రైతు రుణాలు మాఫీ

తమిళనాడు జూన్ 16 అనంత జనశక్తి న్యూస్

తమిళనాడులో రైతులకు ఉపశమనం కలిగించే దిశగా సీఎం విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులపై ఉన్న రుణభారాన్ని తగ్గించేందుకు రూ.75 వేల వరకు వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

అధిక రుణాలకూ ప్రత్యేక వెసులుబాటు

రూ.75 వేల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పించింది. అలాంటి రుణాల్లో రూ.35 వేల వరకు మాఫీ వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది.

రైతుల్లో ఆనందం

ప్రభుత్వ నిర్ణయంతో తమిళనాడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య రైతుల ఆర్థిక భారం తగ్గించడంలో కీలకంగా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రైతు సంఘాలు కూడా స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది.