వయసుతో సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్స్

వయసుతో సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్స్

డాక్టర్. పి. కార్తీక్ రెడ్డి

కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,

కిమ్స్ సవీర, అనంతపురం

అనంతపురం అక్టోబర్ 28, అనంత జనశక్తి న్యూస్

వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు పెరుగుతున్నారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ లు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అవగాహన ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను ప్రజలలో అవగాహన కల్పించుటకు ఉపయోగిస్తారు. ఈ సంత్సరం థీమ్ “స్ట్రోక్‌పై చర్యలు తీసుకోవడానికి అవగాహన మరియు ప్రాతినిధ్యాన్ని కలిపి ముందుకు తీసుకవెళ్దాం.”పక్షవాతం వచ్చినప్పుడు రక్త సరఫరా ఆగిపోవడం వలన ప్రతి నిమిషం 1.9 మిలియన్ల నరాలు మెదడులో చనిపోతూ ఉంటాయి , దీని వలన రోగి యొక్క అవయవాలు అచేతనం కావడం జరుగుతుంది.

పక్షవాతం యొక్క లక్షణాలు, సులువుగా గుర్తించడం

బి ఈ ఎఫ్ ,ఏ ,ఎస్, టి ( BE FAST ) అనే పదమును ఉపయోగిస్తారు. బి అనగా బ్యాలెన్స్ అంటే నడుస్తున్నప్పుడు అదుపుతప్పడం. ఈ అనగా ఐస్ అంటే చూపులో కలిగే లోపం. ఎఫ్ అనగా ఫేన్ అంటే మూతి వంకర పోవడం, ఏ అనగా ఆర్మ్స్ అనగా చేతులు మరియు కాళ్లు చచ్చుపడటం. ఎస్ అనగా స్పీచ్ అనగా మాట తడబాటు పడడం. టి అనగా టైమ్ అంటే సమయం యొక్క ప్రాముఖ్యత. పక్షవాతం వచ్చినప్పుడు వీటిలో ఏదో ఒక లక్షణం ఉన్నపాటున రావడం జరుగుతుంది.పక్షవాతంను త్వరితముగా గుర్తించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఎందువల అనగా *మొదటి 4.5 గంటలు చాలా ప్రాముఖ్యం, నూతన చికిత్సా విధానాలైన థ్రాంబోలైసిస్ లేదా థ్రాంబెక్టమీ ద్వారా మనిషి పూర్తిగా కొలుకోనుటకు అవకాశం ఉంటుంది. ఇందున మొదటి 3 గంటలలో థ్రాంబోలైసిస్ ద్వారా చికిత్స చేసినట్లైతే వ్యక్తి కొలుకునే అవకాశం ఎక్కువగా వుంటుంది. పక్షవాతం వచ్చిన వెంటనే పక్షవాతంకు వైద్యం అందించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కలిగిన వైద్యశాల చేరుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇలా చేయడం ద్వారామొదటి 4.5 గంటలలో ప్రాముఖ్యమైన సమయం వృథా కాకుండా వెంటనే చికిత్స చేయవచ్చు. తద్వారా రోగి తోందరగా కొలుకొనుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.పక్షవాతం బారిన పడకుండా ఉండుటకు కారకాలైన. బిపి, షుగర్, కొలెస్ట్రాల్ , ఉభయ కాయం, మరియూ మద్యపానం,ధూమ పానం వంటి అలవాట్లు ఉన్నవారు వైద్య పరవేక్షణలో ఉండడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవటం వంటి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు.ఈ ప్రపంచ పక్షవాత దినత్సవం రోజు విద్యావంతులైన ప్రజలు ఈ జబ్బు గురించి మరియు నూతన వైద్య విదానాలైన థ్రాంబోలైసిస్ మరియు థ్రాంబెక్టమి వంటివాటి గురించి అవగాహన కలిగి ప్రజలు సరియైన మార్గంలో నడిపించడం విద్యావంతులైన వారందరి కర్తవ్యం.