
ప్రేమించి పెళ్లి… చివరికి భర్తను సజీవదహనం చేసిన భార్
తమిళనాడు మార్చి 14, అనంత జనశక్తి న్యూస్
తమిళనాడులోని కళ్లకురిచ్చి సమీపంలో భార్య చేతిలో భర్త సజీవదహనం అయిన దారుణ ఘటన సంచలనం రేపింది.కె. మామందల్ గ్రామానికి చెందిన ఆంథోనీ రాబిన్ (26) ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం అమ్మూ (22)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే కొంతకాలంగా అమ్మూకు తన అక్క భర్తతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆంథోనీ ఆమెను మార్చుకోవాలని పలుమార్లు ప్రయత్నించాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ నెల 8న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఆంథోనీ భార్యతో గొడవపడి అనంతరం నిద్రపోయాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో అమ్మూ ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను నిద్రిస్తున్న భర్తపై పోసింది.మంటలు అంటుకోకముందే మేల్కొన్న ఆంథోనీ ప్రాణభయంతో బయటకు పరుగెత్తాడు. అయినప్పటికీ అమ్మూ అతని వెంటే వెళ్లి అందరూ చూస్తుండగానే నిప్పంటించినట్లు సమాచారం.తర్వాత అతను స్వయంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసి ఆస్పత్రిలో చేర్పించింది. కానీ చికిత్స పొందుతూ ఆంథోనీ మృతి చెందాడు.ఆంథోనీ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు అమ్మూను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








