మహరాష్ట్ర సీఎంకు ఘన స్వాగతం 

*పుట్టపర్తికి విచ్చేసిన మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ కు ఘన స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్*పల్లె రఘునాథ్ రెడ్డి

సత్యసాయి బాబా ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నా

మహరాష్ట్ర సీఎంకు ఘన స్వాగతం

పుట్టపర్తి నవంబర్ 21,అనంత జనశక్తి న్యూస్

పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100 వ జయంతోత్సవాలకు ముఖ్య అతిథిగా శుక్రవారం మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ పుట్టపర్తికి చేశారు. మహారాష్ట్ర సీఎంకు శ్రీనివాస విశ్రాంతి భవనంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర సీఎం కు వారు సత్య సాయి బాబా చిత్రపటాన్ని బహూకరించి శాలువ కప్పి సన్మానించారు. సత్య సాయి బాబా 100వ జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యువ సమ్మేళన సదస్సుకు హాజరైన మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ కు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులు టిడిపి బిజెపి జనసేన ప్రతినిధులు పలికారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడనవీస్ తో పాటు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, చక్రపాణి ,నిమిష్ పాండే , బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి లు దర్శించుకున్నారు. బాబా వేడుకలకు పుట్టపర్తికి విచ్చేయడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ ఈ సందర్భంగా అన్నారు. మానవాళికి బాబా చేసిన సేవలు ఎంతో అమోఘం అని కొనియాడారు. సత్యసాయి బాబా ఆశీస్సులు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి తోపాటు స్థానిక సత్యసాయి భక్తులు సామకోటి ఆదినారాయణ, గంగాధర్ నాయుడు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.