ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి నాయుడు , ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ బి.సత్యనారాయణ ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.విశ్వకర్మ జయంతిని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో నిష్టతో జరుపుతారని, పశ్చిమ బెంగాల్లోని హల్దియా పారిశ్రామిక ప్రాంతం విశ్వకర్మ పూజకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో, దుకాణాలలో, విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు.ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు మాత్రమే కాకుండా వివిధ రకాల చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు, మెకానిక్ లు స్మిత్తులు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, మొదలైన వారు కూడా ఎంతో నియమ నిష్టలతో జరుపుతారు.ఈ ఆధునిక యుగంలో ఆయన సిద్ధాంతాలు మరియు సృజనాత్మకతకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కష్టపడే తత్వాన్ని పట్టుదలను మరియు నైపుణ్యాన్ని అలవర్చుకుంటే ఎంత కష్టమైనా పనినైనా తేలికగా సాధించవచ్చు అని తెలియచెప్పే విశ్వకర్మ అందరికీ ఆదర్శప్రాయుడని అడిషనల్ ఎస్పీ తెలిపారు.