
వాళ్లకు మనుషుల విలువ తెలీద
వైసీపీ నాయకులపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ, అభివృద్ధి ఆపేది లేదు
ఆనాడు మెడికల్ కాలేజీలు ఎందుకు గాలి కొదిలేశారు..?
పీపీపీ మోడల్ లో నిర్మించి తీరుతాం
జీఎస్టీ సంస్కరణలతో పేదలకు ఎంతో మేలు
అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ సేవలో’.. : మంత్రి
పెనుకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
పెనుకొండ సెప్టెంబర్ 29, అనంత జనశక్తి న్యూస్
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ, అభివృద్ధి ఆపేది లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. జీఎస్టీ సంస్కరణతో పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. వైసీపీ వాళ్లకు మనుషుల విలువ తెలీదని విమర్శించారు. పెనుకొండలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం తనను కలిసి విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 6,309 రేషన్ కార్డులు పంపిణీ చేయగా, నియోజక వర్గంలో 949 మందికి అందజేశామన్నారు. పార్టీలకతీతంగా అర్హుందరికీ రేషన్ కార్డులు అందజేశామన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధేనని, ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో 4.70 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. జగన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలకు ఎంతో మేలు కలుగుతోందన్నారు. జీస్టీ తగ్గింపుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
*అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ సేవలో’..*
ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా భరోసా కల్పించాలన్న లక్ష్యంతో అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ సేవలో పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఒక్కో ఆటో డ్రైవర్ కు రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఆరోజు మధ్యాహ్నం పెనుకొండలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
*ఆనాడు ఎందుకు గాలి కొదిలేశారు..?*
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, సరిహద్దు రాళ్లపై బొమ్మలు వేసుకోవడం తెలుసు… ప్యాలెస్ లు కట్టుకోడానికి డబ్బులుంటాయి.. మెడికల్ కాలేజీలను కట్టడానికి లేవా.. ఆనాడు వాటిని ఎందుకు గాలి కొదిలేశారు..? అని జగన్ నుద్దేశించి మంత్రి సవిత ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను బెదిరించినా, విషం కక్కినా పీపీపీ మోడల్ ద్వారా 10 మెడికల్ కాలేజీలు నిర్మించి తీరుతామని స్పష్టంచేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అందించడమే తమ లక్ష్యమన్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మించి తీరుతామన్నారు. అయిదేళ్లలో మెగా డీఎస్సీ ఎందుకివ్వలేదని, వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఎందుకు విఫలమయ్యారని నిలదీశారు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ మడం తిప్పేశారని మండిపడ్డారు. వైసీపీ వాళ్లకు మనుషుల విలువ తెలీదని మంత్రి సవిత మండిపడ్డారు.








