
రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం
న్యూఢిల్లీ మార్చి 27 అనంత జనశక్తి న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంపై సమగ్రంగా చర్చించారు.ఈ సమావేశంలో రాష్ట్రాల సన్నద్ధత, ఇంధన భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి, వాటిని ఎదుర్కొనే చర్యలపై సీఎంలతో సమీక్ష జరిపారు.అలాగే దేశంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.








