చీపురు పట్టిన నారాయణ 

చీపురు పట్టిన నారాయణ

గాంధీ జయంతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం -మంత్రి నారాయణ

విజయవాడ సెప్టెంబర్ 17అనంత జనశక్తి న్యూస్

అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుండి ప్రాభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ ని నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .పరిశుభ్రమైన,ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనేది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం అని తెలిపారు .ప్రజల భాగస్వామ్యంతో స్వచ్చాంధ్ర వైపు అడుగులు వేస్తామన్నారు .విజయవాడ కేపీ నగర్ లో బుధవారం నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ పాల్గొన్నారు .స్వచ్ఛత పై అవగాహన ర్యాలీలో భాగంగా ఎలెక్ట్రిక్ బైక్ ను మంత్రి నారాయణ నడిపారు .కేపీ నగర్ పార్క్ వద్ద రోడ్లను శుభ్రం మంత్రి శుభ్రం చేసారు .అనంతరం స్వచ్ఛత హి సేవా బ్రోచర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవా ద్వారా గాంధీ జయంతి వరకూ స్వచ్ఛత పై ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు .స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు .అక్టోబర్ రెండు నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తున్నామన్నారు .గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసి,85 లక్షల టన్నుల చెత్త ను మాత్రం రాష్ట్రంపై వదిలి వెళ్ళిపోయిందని ఆరోపించారు .85 లక్షల టన్నుల చెత్తను ఏడాదిలోగా తొలగించాలని గత అక్టోబర్ 2 న సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు .ఇప్పటివరకూ 83 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించామని తెలిపారు .గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా అప్పులు మిగిల్చి వెళ్ళిందన్నారు .ఖజానా ఖాళీ అయినా మున్సిపల్ శాఖ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు .త్వరలో కొత్తగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు .రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు .అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తామని మరోసారి స్పష్టం చేసారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్,ఎండీ అనిల్ కుమార్ రెడ్డి,మెప్మా ఎండీ తేజ్ భరత్,వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర,స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు .