
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి సెప్టెంబర్ 17, అనంత జనశక్తి న్యూస్
సంఘర్షణలతో ముందుకు సాగుతూ, సేవతో జీవితం గడుపుతూ, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తూ భారత్‌ను మహా శక్తిగా నిలిపిన మహానేత నరేంద్ర మోడీ దేశానికి వరప్రసాదం అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అసమాన నాయకత్వాన్ని కొనియాడారు. మోడీ దూరదృష్టి వలన భారత్ నేడు ప్రపంచ వేదికపై గర్వంగా నిలుస్తోంది. గర్వకారణమైన ఆర్థిక సంస్కరణలు, పేదల సంక్షేమం, శక్తివంతమైన రక్షణ వ్యవస్థ, పారదర్శక పాలన – ప్రతి రంగంలోనూ మోడీ ఒక కొత్త యుగాన్ని ప్రారంభించారు అని ప్రశంసించారు.దేశం కోసం జీవించేవారు, ప్రజల కోసం నిద్రలేని రాత్రులు గడిపేవారు, భారతమాత పట్ల అచంచల భక్తితో పనిచేసే మహానుభావుడు నరేంద్ర మోడీ. ఆయన చేతుల్లో భారత్ సురక్షితం, శక్తివంతం, సమగ్రాభివృద్ధి వైపు దూసుకుపోతుంది అని అన్నారు.భారత్‌ను విశ్వగురుగా నిలపాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న మోడీకి మరింత ఆయురారోగ్యాలు కలగాలని, దేశాన్ని ఇంకా ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు మోడీ కేవలం నాయకుడు మాత్రమే కాదు… ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక స్పూర్తి, ఒక ఆరాధ్యుడు, ఒక జాతిపిత స్థాయి నాయకుడు. ఆయన నాయకత్వంలోనే భారత్ ప్రపంచానికే మార్గదర్శకత్వం వహిస్తుందని నమ్ముతున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు గర్వంగా పేర్కొన్నారు.








