
ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ ఆధ్వర్యంలో బాలలదినోత్సవం .
సత్తెనపల్లి,నవంబర్14.
అనంత జనశక్తి న్యూస్
ప్రప్రథమ భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ అధ్యక్షులు లయన్ బండ్లమూడి వీరాంజనేయులు ఆధ్వర్యంలో పట్టణంలోని యానాది కాలనీ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోటీలలో గెలిచిన విద్యార్థులతో పాటు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందచేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నెహ్రూ, ఛత్రపతి శివాజీ, రాణీ రుద్రమదేవి,అల్లూరి సీతారామరాజు వేషధారణ లతో విద్యార్థులు సభికులను ఆకట్టుకున్నారు. సభలో వక్తలు బాలల దినోత్సవ ప్రత్యేకతను వివరిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్టాన్కా బాబు,ఉపాధ్యాయిని నాగరమణి, క్లబ్ సెక్రటరీ లయన్ ముద్దా రమేష్ బాబు, లయన్స్ రీజినల్ ఛైర్మన్ లయన్ తోట చిన సాంబశివయ్య, రీజినల్ సెక్రటరీ లయన్ తవిటి భావనారాయణ, లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ మాజీ అధ్యక్షులు లయన్ మంచికంటి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు లయన్ పెద్దింటి వెంకటేశ్వర్లు, లయన్ కొప్పురావూరి రాజశేఖర్, పలువురు కాలనీ పెద్దలు పాల్గొన్నారు.








