జొన్నగిరి గోల్డ్‌కు మార్కెట్లో ఆదరణ

జొన్నగిరి గోల్డ్‌కు మార్కెట్లో ఆదరణ

ఆంధ్రప్రదేశ్ పటంతో బంగారు బిస్కెట్ల విక్రయాలు

కర్నూలు జూన్ 27, అనంత జనశక్తి న్యూస్

జొన్నగిరి గోల్డ్ పేరుతో 100 గ్రాములు, 500 గ్రాముల బంగారు బిస్కెట్లు మార్కెట్లోకి వచ్చాయి. బిస్కెట్లపై ఆంధ్రప్రదేశ్ పటం ముద్రించి, “మన ఇంటికి మన బంగారం” అనే నినాదంతో విక్రయాలు చేపడుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి చేసిన బంగారానికి గుర్తింపుగా ఈ బిస్కెట్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.