చేనేతల అభివృద్ధికి ఇద్దరు మంత్రుల సంయుక్త కృషి.

చేనేతల అభివృద్ధికి ఇద్దరు మంత్రుల సంయుక్త కృషి

మంత్రుల ప్రోత్సాహం – ధర్మవరం చేనేతలకు కాంచీపురం స్టడీ టూర్ గొప్ప అనుభవం

దిగ్విజయంగా ముగిసిన ధర్మవరం చేనేతల కాంచీపురం స్టడీ టూర్ యాత్ర

మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి సవితమ్మ మార్గదర్శకత్వంలో విజయవంతమైన ధర్మవరం చేనేతల కాంచీపురం స్టడీ టూర్.

బస్సు సహా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం రూరల్ సెప్టెంబర్ 14, అనంత జనశక్తి న్యూస్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలపై, చేనేత & జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనల మేరకు ధర్మవరం చేనేతలకు ఒక చారిత్రాత్మకమైన అవగాహన యాత్ర విజయవంతంగా నిర్వహించబడింది. దేశంలోనే అతి పెద్దదిగా ప్రతిష్టాత్మకంగా అమలు కానున్న ధర్మవరం మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ అభివృద్ధి దిశగా ఈ కాంచీపురం హ్యాండ్‌లూమ్ క్లస్టర్ స్టడీ టూర్ ఎంతో ప్రయోజనకరంగా నిలిచింది. ఈ అధ్యయన యాత్రలో ధర్మవరం నుండి వెళ్ళిన చేనేతకారులు, కాంచీపురం హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌లో జరుగుతున్న ప్రోడక్ట్ డెవలప్మెంట్ సిల్క్ అప్గ్రేడేషన్ పద్ధతులు, ఆధునిక పరికరాల వినియోగం, కొత్త డిజైన్‌ల రూపకల్పన, మరియు మార్కెటింగ్ వ్యూహాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆధునిక మార్పులు, సాంకేతిక అభివృద్ధి, మార్కెట్ ధోరణులను తెలుసుకోవడం ద్వారా తమ నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి చేనేతలకు ఈ టూర్ తోడ్పడనుంది. అలాగే, ఈ సందర్బంగా చేనేతలు కాంచీపురంలోని ప్రసిద్ధి పొందిన ఆలయాలను సందర్శించి, తమ ఐక్యత, క్రమశిక్షణను ప్రతిఫలింపజేసి ధర్మవరం చేనేత కార్మికులు దేశానికి ఆదర్శంగా నిలిచారు.ఈ విజయవంతమైన యాత్ర అనంతరం, మంత్రి సత్యకుమార్ యాదవ్ త్వరలోనే చేనేతలతో స్వయంగా సమావేశమై, వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించి, ధర్మవరం మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ధర్మవరం చేనేతలకు చరిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న ఈ అధ్యయన యాత్ర, భవిష్యత్తులో వారి జీవిత ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఒక కీలక అడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమం లో చేనేత & జౌళి శాఖ కమీషనర్ రేఖరాని, గుంటూరు జిల్లా ఏ.డీ వనజ, శ్రీ సత్య సాయి జిల్లా ఏ.డీ రామకృష్ణ, ఏ.డీ.ఓ లు సుబ్బనాయుడు, శీనా నాయక్, రాజేశ్వరి, బీజేపీ పార్టీ చేనేత నాయకులు గిర్రాజు నాగేష్, నేషనల్ అవార్డు గ్రహీత డిజైనర్ నాగరాజు తో పాటూ 30 మంది ధర్మవరం చేనేత కార్మికులు పాల్గొన్నారు.