
జగన్.. జైలుకెళ్లడం ఖాయం…..
-పెయిడ్ ఆర్టిస్టులతో కోర్టులను మభ్యపెట్ట లేరు
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
శ్రీ సత్య సాయి జిల్లా ప్రతినిధి, నవంబర్ 20, అనంత జనశక్తి న్యూస్:
అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆరేళ్ల అనంతరం తప్పని పరిస్థితుల్లో విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్తూ కూడా సిగ్గుగా బలప్రదర్శనకు దిగడం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టులను నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే హైదరాబాదులో గురువారం నానా హంగామా సృష్టించారని ఓ ప్రకటనలో మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ముందస్తు పకడ్బందీ ప్రణాళికతో ప్రజాబలం ఉందని చెప్పుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టులతో ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ వాసులను నానా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యే వారు వినయంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కానీ జగన్ రెడ్డిలో ఎటువంటి పశ్చాతాపం కనిపించడంలేని తెలిపారు. సీఎంగా తండ్రి ఉండడాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలతో అక్రమ ఆస్తులు అర్జించిన జగన్ కోర్టు కేసుల నుంచి తప్పించుకుని ఎంతోకాలం బయట తిరగలేరని పేర్కొన్నారు.








