డిజిటల్ అరెస్టు’ పేరుతో వృద్ధుడికి టోకరా

‘డిజిటల్ అరెస్టు’ పేరుతో వృద్ధుడికి టోకరా

డిజిటల్ అరెస్టు అంటూ భయపెట్టి రూ.10.27 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు.

విజయవాడ జనవరి 06 అనంత జనశక్తి న్యూస్

మనీ ల్యాండరింగ్ కేసులో మీరు నిందితులని చెప్పి వృద్ధుడిని తీవ్రంగా బెదిరించిన దుండగులు, వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా మొత్తం రూ.10.27 లక్షలు మాయం చేశారు. భయాందోళనకు గురైన బాధితుడు చివరకు విషయం గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ‘డిజిటల్ అరెస్టు’, ‘వీడియో కాల్ విచారణ’ వంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.