అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

తిరుమల, నవంబర్ 06: అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది.ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.