చంద్రబాబు విజన్‌, లోకేష్ యువశక్తి..

చంద్రబాబు విజన్‌, లోకేష్ యువశక్తి..

బీసీ హాస్టళ్లలో సన్నబియ్యంతో రుచికరమైన భోజనం, కార్పొరేట్ సదుపాయాలు

జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, విద్యార్ధుల భవిష్యత్తును నాశనం చేశాడు

విద్యారంగ పునరుజ్జీవనమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

– _రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు_

గుంటూరు, సెప్టెంబర్ 20,అనంత జనశక్తి న్యూస్

గుంటూరు జిల్లా బి.ఆర్. స్టేడియం సమీపంలో నూతనంగా నిర్మించిన సామాజిక సంక్షేమ వసతి గృహాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పార్టీ వ్యవస్థాపకుడు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ లక్ష్యం విద్య, సాధికారత, సమానత్వం. ఆ దిశలోనే విజనరీ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు అని అన్నారు.చంద్రబాబు హయాంలోనే డిజిటల్ క్లాస్‌రూమ్స్, స్కిల్ డెవలప్‌మెంట్, ఉచిత ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య సహాయం, ఐటీ విప్లవం రూపుదిద్దుకున్నాయని, ఇవే లక్షలాది కుటుంబాల భవిష్యత్తును మార్చేశాయని పల్లా  గుర్తు చేశారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి కొత్త దిశ చూపుతున్నారు. ఆధునిక బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా యువతకు భద్రమైన భవిష్యత్తు కల్పిస్తున్నారు. ఆయన కృషి రాష్ట్రానికి అపారమైన సంపద” అని అన్నారు.జగన్ రెడ్డి పాలనలో విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయ్యిందని పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. బీసీ హాస్టళ్లలో పిల్లలకు సరైన భోజనం కూడా అందించలేదు. గోడలు కూలిపోయే పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకోవలసి వచ్చింది. పిల్లలు అనారోగ్యానికి గురైనా పట్టించుకోలేదు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారు అని మండిపడ్డారు.చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ యువశక్తితో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. “సన్నబియ్యంతో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నాం. వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశాం. వంట పాత్రలు, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు రూ.18 కోట్లు మంజూరు చేశాం. గత ప్రభుత్వం వదిలేసిన డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా, ఒక్కొక్కరికీ రూ.15 వేల రూపాయలు ఇచ్చి విద్యకు బలమైన పునాది వేసాం” అని వివరించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డొలా బాల వీరాంజనేయస్వామి, మాజీ మంత్రి మరియు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్యే శ్రీ మహ్మద్ నసీర్, కార్పొరేషన్ల ఛైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.