
అమరావతికి రాజధాని హోదా క్లియర్
కేంద్రం సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ డిసెంబర్ 03 అనంత జనశక్తి న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సవరణ బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లుకు న్యాయశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ అధికార వర్గాలు తెలిపాయి.ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్ 5(2)లో సవరణ చేయడం ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధాని నగరంగా చేర్చే ప్రక్రియ మొదలైంది. ఈ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.పార్లమెంట్ ఆమోదం, అనంతరం కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ వెలువడితే అమరావతి రాజధాని హోదాకు పూర్తి చట్టబద్ధత లభించనుంది. దీంతో సంవత్సరాలుగా సాగుతున్న రాజధాని వివాదానికి కేంద్రం పునాది స్థాయి స్పష్టత ఇస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.








