
అసాంఘిక కార్యకలాపాలు అణచివేయాలి…..
-నిబద్ధతతో విధులు నిర్వర్తించండి.. జిల్లా ఎస్పీ…
-ధర్మవరం టూ టౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్.
-పోలీసుస్టేషన్లు, రికార్డుల నిర్వహణ,పెండింగ్ కేసుల పై లోతుగా పరిశీలన…సమీక్ష….
శ్రీ సత్య సాయి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 2, అనంత జనశక్తి న్యూస్:
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్ లోని టూ టౌన్ సర్కిల్ పోలీస్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ వార్షిక తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ , లాకప్ గది, రిసెప్షన్ కౌంటర్ పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ మరియు లాంగ్ పెండింగ్ , ఎన్ డి పి ఎస్ కేసులు, రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మహిళ డెస్క్ ను పరిశీలించి, మహిళా సమస్యల పరిష్కరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళల నుంచి వస్తున్న ఫిర్యాదులు వాటి యొక్క వివరాలను అడిగి తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చూడాలని ఆదేశించారు.
పట్టుబడిన వాహనాలు వాటి యొక్క కేసుల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు. అనంతరం టూ టౌన్ సర్కిల్ పరిధిలో ఉన్న గ్రామాల్లోని ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభధ్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు.స్థానిక ఎన్నికల రాబోతున్న తరుణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక నిఘా వేయాలన్నారు. అక్రమ మద్యం, ఇసుక… మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ , తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పనిచేయాలని సూచించారు. మహిళా పోలీసులు గ్రామాలకు వెళ్లాలి అక్కడ సమస్యలను తెలుసుకొని పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. బాల్య వివాహాలు, గంజాయి, సైబర్ మోసాలు, పోక్సో కేసులు , నూతన చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నేరస్తులు, రౌడీ షీటర్లు కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. విజిబుల్ పోలీసింగ్,రాత్రి వేళల్లో గస్తీలు పెంచాలన్నారు. చోరీలు నియంత్రించాలని సూచించారు.అవినీతికి తావులేకుండా అంకితబావంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. సిబ్బంది విధులు వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానన్నారు.ఈ వార్షిక తనిఖీలో జిల్లా ఎస్పీతో పాటు ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ టూ టౌన్ సిఐ రెడ్డప్ప, సీసీ చిరంజీవి , ఎస్ఐ వెంకటరాముడు సిబ్బంది పాల్గొన్నారు.








