గుంటూరు ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం.

గుంటూరు ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం.

. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

గుంటూరు జూలై 18, అనంత జనశక్తి న్యూస్

గుంటూరులో ఓ మహిళపై హిజ్రాలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు.ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ హోంమంత్రికి వివరించారు. అలాగే, కేసు విచారణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీసు సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.ఆడబిడ్డల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని అనిత స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కూడా కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించారు.మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి పేర్కొన్నారు.