
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే పునాది
యోగాంధ్ర ద్వారా యోగాను ప్రజల జీవితాల్లో భాగం చేయాలనే లక్ష్యం
యోగ శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ మార్గం : కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ,జూన్ 21:అనంత జనశక్తి న్యూస్
యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మాసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు.12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ , గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. అంతర్జాతీయా యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీ నుండి పాల్గొన్న కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని , ప్రసంగాన్ని వీక్షించడం జరిగింది. అనంతరం ఆయుష్ శాఖ యోగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాభ్యాసాలు చేయించారు. గుంటూరు నటరాజ్ అకాడమీ యోగా గురువు విజయ గౌరీ నేతృత్వంలో సూర్యమంత్రంతో సూర్య నమస్కారాలు , యోగా ద్వారా సమతుల్య ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని నృత్య ప్రదర్శన ప్రదర్శించారు.అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ యోగం కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శరీరం – మనసు – ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమన్నారు. ఆలోచనకు స్పష్టత, ఆవేశానికి నియంత్రణ, జీవితానికి సమతుల్యతను అందించే మార్గమే యోగ.ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో యోగా ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి, అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. నేడు 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమన్నారు. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనశైలిలో యోగం ప్రతి ఒక్కరికీ అత్యవసరమని , శరీరాన్ని దృఢంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే శక్తి యోగానికి ఉందన్నారు. యోగం ద్వారా ఆరోగ్యవంతమైన వ్యక్తులు, ఆరోగ్యవంతమైన కుటుంబాలు, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని , యువత మొబైల్ ఫోన్లు, స్క్రీన్‌లకు పరిమితం కాకుండా యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచారు. జూన్ 21 ఒక్క రోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. యోగా చేసే దేశం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యమైన దేశంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ భారత దేశం యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందని , ఒక దేశ పౌరునిగా ఇందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. యోగాను 175 దేశాలు దత్తత చేసుకున్నాయని , సుమారు 190 దేశాలు అమలు చేస్తున్నాయన్నారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రపంచానికి భారతదేశం నేర్పించ్చిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ సంవత్సరం మెగా క్యాంపెన్ లో లాంచ్ చేసి 15 రోజులు పెట్టడం జరిగింది. గత సంవత్సరం ఒక నెల రోజుల పాటు క్యాంపెన్ పెట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పే విధంగా విశాఖపట్నం లో సుమారు మూడు లక్షల మందితో యోగా చేయడం జరిగిందన్నారు. ఈ 15 రోజుల యోగా క్యాంపెన్ గుంటూరు జిల్లా నుండి 11 వేల మంది ట్రైనర్లను గుర్తించి , అనేక స్థాయిలలో పోటీలు నిర్వహించి సుమారు 4.50 లక్షల మంది వరకు రిజిస్టర్ అయి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగిందన్నారు. ఈ క్యాంప్ వరకే కాకుండా యోగాను మన జీవన శైలిలో ఒక భాగస్వామ్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి పులుపునిచ్చారన్నారు. మనం ఎప్పుడు చూడని కొత్త రోగాలు చూస్తున్నామని 40 సంవత్సరాల వయస్సుకే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న సమయంలో మన పూర్వీకులు అందించిన యోగా ఒక వరమన్నారు. దీనిని మరచిపోకుండా ప్రతి రోజు దినచర్యలు భాగం చేసుకుంటే దీని నుండి వచ్చే ఆరోగ్య ఫలితాలు కేవలం మనమే కాకుండా మన కుటుంబ సభ్యులు , మన సమాజం మన రాష్ట్రాన్ని కూడా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఈ క్యాంపెన్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మన జిల్లాను ఒక ఆరోగ్యమైన జిల్లాగా తీర్చిదిద్దెందుకు ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ఈ 12 వ అంతర్జీతీయ యోగా దినోత్సవం రోజునే కాకుండా ప్రతి రోజు ఒక గంట పాటు యోగా చేసి ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని కోరుకుంటు , ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ యోగా మన దేశంలో ప్రారంభం అయి ప్రపంచలోని 190 దేశాలు ఆచరిస్తున్నాయన్నారు. దేశ ప్రధాని మోడి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైందన్నారు. అన్ని దేశాలలో తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకుంటున్నాయని , మన దేశంలో కంటే కూడా ఇతర దేశాలలో యోగాను ఎక్కువ మంది అభ్యశిస్తున్నారన్నారు. దేశ ప్రధాని ఈ సంవత్సరం యోగాను “ఆరోగ్యం, జ్ఞానం మరియు ప్రపంచ శాంతి కోసం” అనే థీమ్ తో ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో డిఆర్ ఓ ఎన్.ఎస్.కే.ఖాజావలి , ఆర్ డి ఓ కే.శ్రీనివాస రావు, డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , జిల్లా అధికారులు , జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారు, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ప్రజా ప్రతినిధులు, విద్యార్దులు , ప్రజలు పాల్గొన్నారు.








