కొప్పర్తి పారిశ్రామిక పనులు గడువులోగా పూర్తి చేయాలి

కొప్పర్తి పారిశ్రామిక పనులు గడువులోగా పూర్తి చేయాలి

కడప, సెప్టెంబర్ 19: కొప్పర్తి ఎన్‌ఐసీడీసీ పారిశ్రామిక ప్రాంతంలో రూ.1,006 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల పనులను అక్టోబర్‌ 2028 నాటికి పూర్తి చేయాలని ఎన్‌ఐసీడీసీ సీఈఓ, ఎండీ రజత్ కుమార్ సైని అధికారులను ఆదేశించారు.2,595.74 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక ప్రాంతం ద్వారా సుమారు రూ.8,860 కోట్ల పెట్టుబడులు, 54,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ డా. నిధిమీనా, సబ్ కలెక్టర్ హెచ్‌.ఎస్‌. భావనలతో కలిసి పరిశీలించిన ఆయన, శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు.