దలవాయి రమాదేవికి ఎమ్మెల్సీగా ప్రకటించడం వడ్డెర్లకు గర్వకారణం
తలుపుల మండలం వడ్డెర సంఘం నాయకులు.
కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.
తలుపుల ఆగస్టు19 అనంత జనశక్తి న్యూస్
టిడిపి జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిన్నటి అసెంబ్లీ క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా దలవాయి రమాదేవిని ఎంపిక చేసినందుకు కదిరి నియోజకవర్గం తలపుల మండలం వడ్డెర సంఘం నాయకులు మరియు టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, అలాగే గత ప్రభుత్వంలో దలవాయి రమాదేవి కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కేసులు మీద కేసులు పెట్టి, వారిని భయభ్రాంతులకు గురిచేసిన కానీ, ఎక్కడ తగ్గకుండా భయపడకుండా కేసులు ఎదుర్కొని, తెలుగుదేశం పార్టీ వచ్చేవరకు పార్టీని వీడకుండా పార్టీ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ దలవాయి రమాదేవి పార్టీ వెన్నంటే ఉండడం బూత్ క్లస్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు ఎదగడం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వారి శ్రమను గుర్తించి ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం వడ్డెర్లకు గర్వకారణం అని, అలాగే అసెంబ్లీ సమావేశాలలో 25% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 35 శాతానికి పెంచడం, బీసీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు మరువరానిదని, అలాగే తలుపుల మండలంలో వడ్డెరలు అధిక సంఖ్యలో ఉన్నారని గతంలో లాగా కాకుండా వడ్డెర్లకు మండల వ్యాప్తంగా గుర్తించబడే పదవి పదవులు ఎంపీపీ, జడ్పిటిసి వంటి వాటికి అవకాశం ఇవ్వాలని వడ్డెర సంఘం నాయకులు కొనియాడారు, ఈ కార్యక్రమంలో వల్లెపు గంగరాజు, టిడిపి తలపుల క్లస్టర్ ఇంచార్జ్ శ్రీనివాసులు, టిడిపి జిల్లా వడ్డెర సాధికార కమిటీ జనరల్ సెక్రెటరీ గంగరాజు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి వేగముణి, తలపల మేజర్ పంచాయితీ గ్రామ జనరల్ సెక్రెటరీ రాజు, తలుపుల బూత్ కన్వీనర్ వెంకటరమణ, టిడిపి సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.









