భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలం దర్శన విధానాల్లో మార్పులు

భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలం దర్శన విధానాల్లో మార్పులు

నంద్యాల, జూలై 18 (అనంతజనశక్తి న్యూస్): శ్రీశైలం దేవస్థానంలో సెలవు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన విధానాల్లో కీలక మార్పులు చేపట్టినట్లు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.కొత్త విధానాల ప్రకారం ఉదయం వేళల్లో అలంకార దర్శనం నిర్వహించనుండగా, నిర్ణీత సమయంలో నేరుగా వచ్చే వీఐపీలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు. సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు సాయంత్రం సమయంలో స్పర్శ దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.సెలవు రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్న నేపథ్యంలో దర్శన వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ఈఓ శ్రీనివాసరావు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ నిర్ణయంతో దేవస్థానం సిబ్బంది, పాలకమండలి సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త దర్శన విధానాలు అమలులోకి రావడంతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.