
హైకోర్టును ఆశ్రయించిన రావణ్
తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని విజ్ఞప్తి
అమరావతి, జూలై 5:అనంత జనశక్తి న్యూస్
తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారించాలని కోరుతూ రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై నమోదైన కేసుల దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కూడా న్యాయస్థానాన్ని కోరారు.ఈ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ అధిపతితో పాటు పలువురు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చారు. తనపై నమోదైన కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.రావణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.







