విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు..

ముమ్మరంగా గాలింపు చర్యలు

విశాఖపట్నం, జూలై 5:అనంత జనశక్తి న్యూస్

విశాఖపట్నం నుంచి జూలై 1న చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారితో ఎలాంటి సంబంధం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మత్స్యకారుల మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో వారి ఆచూకీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మత్స్యకారుల కుటుంబ సభ్యులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని దిశల్లో గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం తమ వారిని క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.