
15 ఏళ్లకే శతకం.
రువాండా యువతికి చరిత్రాత్మక ఘనత!
అంతర్జాతీయం మార్చి 21, అనంత జనశక్తి న్యూస్
రువాండాకు చెందిన యువ క్రికెటర్ ఫ్యానీ ఉటగుషిమనిండే అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన చరిత్ర సృష్టించింది. కేవలం 15 ఏళ్ల 223 రోజుల వయసులోనే టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.ఘనాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్యానీ అజేయంగా 111 పరుగులు చేసి తన ప్రతిభను చాటింది. ఇదే ఆమె తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు) పేరిట ఉండగా, ఫ్యానీ ఆ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర రాసింది.తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించడం, అంతేకాక అతిపిన్న వయసులో ఈ ఘనత అందుకోవడం క్రికెట్ ప్రపంచంలో విశేష చర్చకు దారితీసింది.








