
హోటల్ బిల్లులో కొత్త ట్విస్ట్.. టిఫిన్‌తో పాటు గ్యాస్ ఖర్చులు కూడా!
చెన్నై మార్చి 13″అనంత జనశక్తి న్యూస్”
చెన్నైలో ధరల పెరుగుదల కొత్త రూపం దాల్చింది. నిన్న ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఒక వినియోగదారు హోటల్‌లో టిఫిన్ చేసి బిల్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. బిల్లులో టిఫిన్ ధరలతో పాటు వంట గ్యాస్ వినియోగ రుసుము పేరుతో అదనపు మొత్తం కూడా చేర్చినట్లు గుర్తించాడు.“మేము హోటల్‌కు వచ్చేది వండిన ఆహారం తినడానికి. మళ్లీ వంట గ్యాస్ ఖర్చు విడిగా ఎందుకు చెల్లించాలి?” అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.ఈ విధంగా గ్యాస్ ఖర్చులను ప్రత్యేకంగా వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని వినియోగదారుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి అదనపు రుసుములు విధించడం ప్రజలపై మరింత భారం మోపుతుందని వారు పేర్కొంటున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.








