అమెరికా–ఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
“అనంత జనశక్తి న్యూస్
ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణ అంశంపై అమెరికా, ఇజ్రాయెల్‌తో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ యుద్ధాన్ని తామే ప్రారంభించలేదని, ఇది తమకు కోరుకున్న యుద్ధం కాదని పేర్కొంది.అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే యుద్ధాన్ని కొనసాగిస్తున్నామని ఇరాన్ తెలిపింది. అలాగే టర్కీ, సైప్రస్, అజర్బైజాన్ దేశాలపై తాము ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది.దేశాల మధ్య విభేదాలు సృష్టించేందుకు శత్రుదేశాలు చేసిన దాడులు కావచ్చని ఇరాన్ ఆరోపించింది.








