
నేడు ఏపీలో పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల
అమరావతి / హైదరాబాద్: అనంత జనశక్తి న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు నేడు అధికారికంగా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను సంబంధిత పాఠశాలల ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేడు టెన్త్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్‌టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని విద్యాశాఖ సూచించింది.రెండు రాష్ట్రాల్లోనూ విద్యార్థులు పరీక్షా నియమావళిని కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు








