
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.
-40 వార్డులలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలి.
-రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, చేనేత కార్మికుల సమస్యల పై దృష్టి వహించాలి.
-నేతన్న భరోసా కార్మికుల ఖాతాలో వెంటనే జమ చేయాలి.
-సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
ధర్మవరం డిసెంబర్ 2, అనంత జనశక్తి న్యూస్:
ధర్మవరం పట్టణంలో ఎన్జీ హోమ్ నందు సిపిఐ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ అధ్యక్షతగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ….. పట్టణంలోని 40 వార్డులో ఉన్న సమస్యలను అధికారులకు తెలియజేసే విధంగా ప్రతి వార్డు వెళ్లి ప్రజల సమస్యలు, వీధిలైట్లు , డ్రైనేజీ సమస్యలు , రోడ్ల సమస్యలు మరి ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యలు గురించి కార్మికుల ఆత్మహత్యల గురించి , నేతన్న భరోసా వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని వారి సమస్యలు తీర్చే విదంగా ప్రజల కోసం నిరంతరం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం అధ్యక్ష,కార్యదర్శులు, వెంకటనారాయణ, వెంకటస్వామి, ఆదినారాయణ, శ్రీనివాసులు, తాజుద్దీన్ మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.








