పేద విద్యార్థుల కుటుంబాలపై భారం వద్దు…

పేద విద్యార్థుల కుటుంబాలపై భారం వద్దు…

-ధర్మవరం 2087 మంది విద్యార్థుల ఎస్ ఎస్ సి పరీక్షా ఫీజులు భరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్.

-మంత్రి చెక్కును అధికారులకు, విద్యార్థులకు అందజేసిన హరీష్ బాబు.

-విద్యారంగా అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం మంత్రి కృషి.

-రాష్ట్రంలో ధర్మవరం నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి.

శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 2, అనంత జనశక్తి న్యూస్:

ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, వారి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఒక అభూతపూర్వమైన ప్రజాహిత నిర్ణయం తీసుకున్నారు.నియోజకవర్గంలోని మొత్తం 2087 మంది 10వ తరగతి విద్యార్థుల ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షా ఫీజులన్నిటిని పూర్తిగా తన వ్యక్తిగత నెల జీతం నుంచే భరించనున్నట్లు మంత్రి గారు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా మొత్తం ₹2,60,875/- రూపాయల చెక్కును విద్యాశాఖ అధికారులకు అందించారు.రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ చెక్కును ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ పరిధిలోని బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓలకు, హెచ్‌ఎంలకు మరియు విద్యార్థులకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ….ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం మంత్రి సత్య కుమార్ యాదవ్ చూపుతున్న అండదండలు అభినందనీయం. ధర్మవరం నియోజకవర్గంలో ఒక్క విద్యార్థి కూడా చదువులో వెనుక పడకుండా ఉండాలని మంత్రి కి ఉన్న నిబద్ధతకు ఈ నిర్ణయం నిదర్శనం. అదేవిధంగా విద్యారంగ అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణం కోసం సత్య కుమార్ యాదవ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతోంది. ఇలాంటి సంక్షేమ చర్యలు విద్యార్థుల్లో మరింత ధైర్యం, నమ్మకం నింపుతున్నాయి, అని హరీష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి ఎంపీడీవో నబి రసూల్, ఎంఈఓ లు రాజేశ్వరి, గోపాల్ నాయక్, హై స్కూల్ హెచ్ఎం సుమన, తదితర పాఠశాలహిత్యంలో పాల్గొన్నారు.