ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన – డాక్టర్ సింగరాజు సాయికృష్ణ

ఉచిత మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన – డాక్టర్ సింగరాజు సాయికృష్ణ

రాజుపాలెం.నవంబర్ 30. అనంత జనశక్తి న్యూస్

మండలంలోని గణపవరం గ్రామంలో సత్తెనపల్లి సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సింగరాజు చారిటబుల్ ట్రస్టు సౌజన్యం తో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేషస్పందన లభించందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఈ శిబిరంలో జనరల్ వ్యాధులు గుండె సంబదిత వ్యాధులు ఊపిరి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేసి సుమారు 250 మందికి వైద్య సేవలు అందజేశారు.అలాగే అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ సింగరాజు సాయికృష్ణ,డాక్టర్ సింగరాజు విద్య మరియు గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ కి చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శివప్రసాద్ లను గణపవరం గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ శిబిరంలో గణపవరం గ్రామ మాజీ సర్పంచ్ నల్లూరి లక్ష్మినారాయణ ,వడ్డెంపూడి వెంకట్రావు కావటి శ్రీనివాస రావు,మోరస శ్రీనివాసరావు, షేక్ సలీం,ఆర్ ఎం పి వైద్యులు డా సురేష్, డా రంగబాబు మరియు గణపవరం, బలిజెపల్లి, బీరవల్లిపాయ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.