బాల్య వివాహ్ ముక్త్ కార్యక్రమం నిర్వహించిన అదనపు ఎస్పీ సత్తిరాజు

బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించిన అదనపు ఎస్పీ సత్తిరాజు.

నరసరావుపేట,నవంబర్27.అనంత జనశక్తి న్యూస్

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాలమేరకు పల్నాడు జిల్లా ప్రధాన కార్యాలయం నందు “బాల్య వివాహ్ ముక్త్ భారత్ ” కార్యక్రమాన్ని నిర్వహించిన అదనపు ఎస్పీ (AR) సత్తిరాజు.ఈ కార్యక్రమం అనంతరం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన పెంపుదల కోసం పోలీసులు అధికారులు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించి, సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపడానికి అందరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సత్తిరాజు మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక శిశువు భవిష్యత్తును దెబ్బ తీయడంతో పాటు,శారీరక , మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పల్నాడు జిల్లా పోలీసులు ప్రజలకు ఈ సందేశాన్ని విస్తృతంగా చేర వేసి, బాల్య వివాహాలకు పూర్తిగా అరికట్టే దిశగా చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సత్తిరాజు హాజరైన అధికారులు మరియు సిబ్బందితో బాల్య వివాహ్ ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ ప్రతిజ్ఞలో బాల్య వివాహాలను అరికట్టేందుకు మా కుటుంబం, పరిసరాలు, సమాజంలో జరిగే ప్రతి ప్రయత్నాన్ని నిలువరించడానికి కట్టుబడి ఉన్నట్లు,బాలల విద్య, రక్షణ, భవిష్యత్తు కోసం బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో
అదనపు ఎస్పి (AR) సత్తిరాజు తో పాటు AR DSP మహాత్మా గాంధీ రెడ్డి , వెల్ఫేర్ RI L. గోపీనాథ్ , అడ్మిన్ RI S.కృష్ణ ,MT RI యువరాజు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.