
శాంతిభద్రతల పరిరక్షణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్.
నాగార్జున సాగర్,నవంబర్ 27.అనంత జనశక్తి న్యూస్
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఉదయం పోలీసు శాఖ మరియు ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ పరిధి హస్నాబాద్ తాండా గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో గ్రామంలో సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు,గొడ్డళ్లు – 16 ,కత్తులు – 14, స్వాధీనం చేసుకొని,200 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేయడం జరిగింది.

అదేవిధంగా పాత నేరస్తులను ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కేసుల నిందితులతో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీజ్ భాష, మాచర్ల టౌన్ సిఐ T.వెంకట రమణ, నాగార్జునసాగర్ ఎస్ఐ అశోక్, మాచర్ల రూరల్ ఎస్సై సంధ్యారాణి, మాచర్ల టౌన్ ఎస్ఐ అనంత కృష్ణ , మాచర్ల ఎక్సైజ్ సీఐ N.వెంకటరమణ, ఈపూరు ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు , నరసరావుపేట ఎక్సైజ్ సీఐ గౌస్ భాషా , గురజాల ఎక్సైజ్ ఎస్సై సత్యనారాయణ మరియు 68 పోలీసు సిబ్బంది మంది పాల్గొన్నారు.








