
సత్యసాయి పంపిన పుస్తకం… అది నా గోల్డెన్ మూమెంట్: సచిన్
పుట్టపర్తి నవంబర్ 19,అనంత జనశక్తి న్యూస్
ప్రజలను తీర్పు చేయకుండా, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయిబాబా చేసిన సందేశం తన జీవితాన్ని మార్చిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన ఒక అరుదైన సంఘటనను ఆయన స్మరించుకున్నారు.ఆ సమయంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉన్న వేళ బెంగళూరులో టీమ్ శిబిరంలో ఉంటున్న తనకు సత్యసాయిబాబా స్వయంగా ఫోన్ చేశారని సచిన్ తెలిపారు. అనంతరం ఒక పుస్తకాన్ని పంపించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారని చెప్పారు.“ఆ పుస్తకం నాకు అపారమైన శక్తి, స్ఫూర్తిని ఇచ్చింది. అదే సంవత్సరం మేము వరల్డ్కప్ ట్రోఫీని గెలుచుకున్నాం. అది నా జీవితంలో నిజమైన గోల్డెన్ మూమెంట్” అని సచిన్ పేర్కొన్నారు.సత్యసాయి చెప్పిన ‘ప్రజలను జడ్జ్ చేయొద్దు… వారిని అర్థం చేసుకోండి’ అనే సందేశం తన ఆలోచనలను మరింత మలిచిందని, సమస్యలను చూడే విధానం మొత్తం మారిపోయిందని సచిన్ వెల్లడించారు.








