సచివాలయం అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

పట్టణం లోని 6వ వార్డు నందు ముఖ్య నాయకులతో మరియు సచివాలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మి నారాయణ.

సత్తెనపల్లి,నవంబర్13. అనంత జనశక్తి న్యూస్

6వ వార్డులోని ప్రజలు తీసుకువచ్చిన గృహ పెన్షన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన శాసనసభ్యులు కన్నా.వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు వస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేసిన శాసనసభ్యులు కన్నా.కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను నాయకులు ప్రతి ఇంటికి వివరించాలని తెలియ జేశారు.ప్రతి వార్డును అభివృద్ధి పథంలో ముందు ఉంచేలా పని చేయాలని సూచించిన కన్నా.

ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసే విషయంలో పారదర్శకతతో అధికారులు పని చేయాలన్న శాసనసభ్యులు కన్నా.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజక వర్గ పట్టణ వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.